నేను, మా చెల్లి కవల పిల్లలం: హీరోయిన్ సాయిపల్లవి

  • మాది తమిళనాడు సరిహద్దుల్లోని కోటగిరి దగ్గర ఓ కుగ్రామం
  • మా అమ్మ పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు
  • అందుకే, నా పేరులో ‘సాయి’ ఉంది 
తాను, తన చెల్లెలు పూజ కవల పిల్లలమని ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి చెప్పింది. నాని సరసన నటించిన సాయిపల్లవి చిత్రం ఎంసీఏ మంచి టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తమది తమిళనాడు సరిహద్దుల్లోని కోటగిరి దగ్గర ఓ కుగ్రామమని, తన తల్లిదండ్రులు రాధామణి, సెంతమారై అని చెప్పింది.

తన తల్లి గృహిణి కాగా, తండ్రి కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పిన సాయి పల్లవి, తన పేరు మొదట్లో ‘సాయి’ అనే పదం ఎందుకు చేరిందో కూడా చెప్పింది. తన తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలని, అందుకే, తన పేరు మొదట్లో ఈ పదాన్ని కలిపి ‘సాయి పల్లవి’ పేరు పెట్టారని చెప్పింది. తనకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, ఆ ఆసక్తి కారణంగా తాను పన్నెండో తరగతి పూర్తయ్యాక ‘ఈటీవీ’ డ్యాన్స్ షోకి దరఖాస్తు చేసుకుంటే ఎంపికయ్యానని చెప్పింది.

 అయితే, చదువు తర్వాతే ఇవన్నీ అనీ, తన తండ్రి నాడు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో మరో షో చేశానని, ఆ తర్వాతే సినిమాల్లో నటించాలనే ఆసక్తి తనకు కలిగిందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
sai pallavi
fida

More Telugu News